
ఈమూవీ నిడివి ఎక్కువగా ఉండటంతో ఈమూవీ నైజాం బయ్యర్ దిల్ రాజ్ ఎలర్ట్ అయి ఈమూవీ నిడివిని ఏదోవిధంగా 10 నిముషాలు తగ్గించమని ఈమూవీ నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈమూవీని 10 నిముషాలు తగ్గిస్తే సినిమాలోని సీన్స్ మధ్య కనెక్షన్ కుదరడం లేదని ఈమూవీ దర్శక అభిప్రాయపడుతున్నట్లు టాక్.
ఈమూవీ పై మరో నెగిటివ్ వార్త కూడ హడావిడి చేయడం మొదలుపెట్టింది. ఈమూవీ షూటింగ్ చివరిలో పూజా హెగ్డే ప్రభాస్ ల మధ్య ఒక చిన్న విషయమై చిన్న గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఈమూవీ నిర్మాతలు ఖండించారు. ప్రస్తుతం అనేకచోట్ల జరిగిన ఈమూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో వేదిక పై పూజా హెగ్డే ప్రభాస్ లు కలిసి సందడి చేస్తున్నప్పటికీ వీరిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.
ఇది ఇలా ఉండగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు మంచి డిమాండ్ ఏర్పడటం ఈమూవీ బయ్యర్లకు ధైర్యం కల్గించే వార్తలు అయినప్పటికీ ఈమూవీ ఫైనల్ టాక్ లో ఏమాత్రం తేడా వచ్చినా ఈమూవీ కలక్షన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈ మూవీకి 500 కోట్లకు పైదా బిజినెస్ అయిన పరిస్థితులలో ఈ మూవీని సగటు ప్రేక్షకుడు రిపీటేడ్ గా ఒకటికి రెండు సార్లు ధియేటర్లకు వెళ్ళి చూడకపోతే ఈ మూవీ బయ్యర్లకు నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది అంటూ మరొక నెగిటివ్ ప్రచారం జరుగుతోంది..