ప్రభాస్ మరియు పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఇప్పటికే అనేక వాయిదాలు పడి ఈ మార్చ్ 11న విడుదల అవ్వడానికి రెడీ అయింది

ప్రస్తుతం మరోసారి ప్రమోషన్స్ ని భారీగా నిర్వహిస్తున్నారట చిత్ర యూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ మరియు సాంగ్స్ తో సినిమాపై అంచనాలు అయితే భారీగా పెరిగాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశం మొత్తం సినీ ప్రేమికులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ రాధేష్ శ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర విశేషాల కంటే వ్యక్తిగత అంశాలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి మరియు పూజ హెగ్డేతో గొడవలపై ప్రభాస్ క్లారిటీ ఇలాంటి కాంట్రవర్సీ వార్తలే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక రాధే శ్యామ్ షూటింగ్ లో పూజ హెగ్డే తో మనస్పర్థలు వచ్చాయా అన్న ప్రశ్నకి మొన్న ప్రభాస్ సమాధానం ఇవ్వగా నేడు పూజ హెగ్డే కూడా ఈ పుకార్లపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.

రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ సమయంలోనే ప్రభాస్‌- పూజ హెగ్డేల మధ్య మనస్పర్థలు వచ్చాయని అలాగే వారిద్దరు మధ్య మాటలు లేవని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముంబైలో జరిగిన రాధేశ్యామ్‌ ప్రమోషన్‌ ఈవెంట్‌లో సైతం వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు అస్సలు కనిపించలేదు. పక్కనే పక్కనే ఉన్నప్పటికీ మూవీ హీరోహీరోయిన్‌ మధ్య ఉండే బాండింగ్‌, కెమిస్ట్రీ అయితే మిస్‌ అయ్యింది. ఈ కార్యక్రమంలో వారిద్దరూ ఎడమెహం పెడమెహంగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చెకూరిందట.దాంతో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిందట పూజా హెగ్డే. ప్రభాస్ గొప్ప మనసున్న వ్యక్తి అంటూ చెప్పుకొచ్చిందట.. షూటింగ్ సమయంలో ప్రభాస్ తనకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడని అంతే కాకుండా షూటింగ్ సమయంలో ప్రభాస్ తనకోసం ఇంటి నుండి భోజనం కూడా తెప్పించేవాడని తెలిపింది. అదంతా వట్టి పుకార్లే. నేనే కాదు ఎవరైనా సరే ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు' అని ప్రభాస్ గురించి తెలుపుతూ వచ్చే వార్తలని పుకార్లని కొట్టిపారేసిందట పూజ హెగ్డే.

మరింత సమాచారం తెలుసుకోండి: