అభిమానులకు హీరోలపై ప్రేమాభిమానాలు ఉండటం సహజమే. అయితే కుటుంబం కంటే ఎక్కువ ప్రేమను నమ్మిన వారి కంటే ఎక్కువ ప్రేమను చూపించడం ఏమాత్రం సరికాదు. ఈ విషయాన్ని ఎంతో మంది హీరోలు తమ అభిమానులకు సైతం సూచించారు. అలా నందమూరి అభిమానులకు తమ హీరో పై ఉండే అభిమానం సంగతి చెప్పనవసరం లేదు. అందరు హీరోలకు పిచ్చి అభిమానం ఉంటే ఈ హీరోలకు మాత్రం వెర్రి అభిమానులు ఉంటారు.

తమ హీరో కోసం ఎలాంటి స్థాయికైనా వెళతారు వీరు. ఆ విధంగా ఎన్టీఆర్ అభిమానులు దేశవ్యాప్తంగా కోట్లల్లో ఉండగా వారిలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ అంటే ప్రాణాలు ఇచ్చే అంత అభిమానం ఉంటుంది. వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్న ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడంతో ఆయన క్రేజ్ భారీ స్థాయిలో బయటపడుతుంది. మెగా పవర్ స్టార్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ ప్రియులతో పాటు అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉండగా మార్చి 25వ తేదీన అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంతోషం పరుస్తుంది.

ఆ విధంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ టిక్కెట్ లను అమెరికా కు చెందిన ఓ అభిమాని భారీగా ఖరీదు చేయడం హాట్ టాపిక్ గా మారింది అయితే అవి మర్చిపోకముందే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన థియేటర్ మొత్తాన్ని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బుక్ చేసుకోవడం పలువురిని భారీగా ఆశ్చర్యపరుస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనపై ఉన్న ప్రేమను ఈ విధంగా చేశాడని అంటున్నారు. అయితే అదే అమెరికాకు చెందిన కొంతమంది ఫ్లోరిడా నగరంలోని రామ్ చరణ్ అభిమానులు తమకు అవకాశాన్ని ఇవ్వకుండా చేస్తున్నారని వాపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెల్లడిస్తున్నారు. ఈ విధమైన అభిమానం మంచిది కాదని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: