త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాని మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కి రీమేక్ గా తీసిన విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన భీమ్లా నాయక్ మూవీకి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఇంకా చాలా ఏరియాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో నడుస్తుండడం విశేషం. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా యొక్క జ్యూక్ బాక్స్ ని నేడు సాయంత్రం 4 గం. 5 నిమిషాలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ ప్రకటించింది.
సినిమాలోని రెండు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ కూడా ఈ జ్యుక్ బాక్స్ లో ఉండనున్నట్లు టాక్. మరోవైపు భీమ్లా తో తమ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ. 100 కోట్ల షేర్ కొల్లగొట్టడంతో పలువురు ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఈగో సమస్యల కారణంగా తలెత్తిన వివాదం మధ్యలో పలు మలుపులు తిరుగుతూ చివరకు ఎలా ముగిసింది అనే కథాంశంతో దర్శకుడు సాగర్ ఎంతో గ్రాండ్ గా తీసిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు.