సభా ఆజాద్ 2008లో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. సింగర్ కమ్ యాక్టర్‌గా రెండు పడవల ప్రయాణం చేస్తోంది. కానీ హృతిక్‌తో డేటింగ్ చేశాకే సభా ఆజాద్ పేరు పాపులర్ అయ్యింది. జనాలు సభా గురించి వెతకడం మొదలుపెట్టారు. ఈ సెర్చింగ్‌లో హృతిక్‌తో డేటింగ్ స్టార్ట్ చేశాక, లవర్ ఇమాద్ షాకి బ్రేకప్ చెప్పిందని తెలుస్తోంది.
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నజీరుద్దీన్ షా పెద్ద కొడుకు ఇమాద్ షా. యాక్టర్ కమ్ మ్యూజీషియన్‌గా సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయాణంలోనే సభా ఆజాద్‌తో పరిచయం అయ్యింది. ఇద్దరూ ఏడేళ్ల పాటు సహజీవనం చేశారు. అయితే 2013లో మొదలైన వీళ్ల ప్రేమకథకి 2020 చివరలో ఎండ్ కార్డ్ పడింది. అక్కడి నుంచి హృతిక్‌తో డేటింగ్ స్టోరీ మొదలుపెట్టిందట సభా.
హృతిక్ రోషన్‌కి ఫీమేల్ ఆడియన్స్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌లో ఎంతమంది యంగ్‌స్టర్స్ ఉన్నా, ఇప్పటికీ హృతిక్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పైగా వయసు పెరుగుతన్న కొద్దీ ఆ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. అలాగే హృతిక్ లవ్‌స్టోరీస్ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత నలుగురు హీరోయిన్స్‌తో కథ నడిపిన హృతిక్ వాటన్నిటిని మధ్యలోనే వదిలేశాడు. మరి సభా డేటింగ్ స్టోరీ ఏమవుతుందనేది బిగ్ క్వశ్చన్‌గా మారింది.
హృతిక్ రోషన్‌కి సుశానే ఖాన్‌తో పెళ్లైన కొత్తలోనే కరీనా కపూర్‌తో ప్రేమలో పడ్డాడనే ప్రచారం జరిగింది. 'యాదే, మే ప్రేమ్‌కీ దీవానీ హుం' సినిమాల్లో కలిసి నటించిన హృతిక్, కరీనా ఆటైమ్‌లో చాలా క్లోజ్ అయ్యారనే టాక్ వచ్చింది. అయితే హృతిక్ ఫ్యామిలీ ఈ ప్రేమకథకి బ్రేకప్ కార్ద్ వేసిందట. కరీనాని హృతిక్‌కి దూరంగా ఉండమని చెప్పిందట రోషన్ కాందాన్. అప్పటి నుంచి ఇద్దరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
హృతిక్ రోషన్ 'కైట్స్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హంగామా చెయ్యలేదు గానీ ఈ మూవీ హీరోయిన్ బార్బరా మోరీ మాత్రం చాలా పాపులర్ అయ్యింది. ఈ సినిమా టైంలో హృతిక్, బార్బరా చాలా క్లోజ్ అయ్యారని రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారనే ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ స్టోరీ తెలిసి అప్పట్లో సుశానే ఖాన్ పుట్టింటికి వెళ్లిందనే వార్తలొచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక బార్బరా కథకీ ఎండ్ కార్డ్ పడింది. హృతిక్, సుశానే ఇద్దరూ కలిసిపోయారు.