అయితే ఆమె వేసే బట్టలు..సెలక్ట్ చేసుకునే సినిమాలు..పెట్టే పోస్ట్‌లు..అంతేకాదు ప్రమోట్ చేసే బ్రాండ్ లు..ఇక ఇలా అన్నింటిలోను తేడాలు వచ్చేశాయి. అయితే దీంతో అక్కినేని అభిమానులు బాధపడ్డారు. సమంత మాత్రం లైట్ తీసుకున్నట్లుంది.అయితే ఎంత లైట్ అంటే గోవాలో టూ పీస్ బికినితో యోగాసనాలు వేస్తున్న వీడియోని రిలీజ్ చేసింది. ఇక అప్పట్లో ఈ మ్యాటర్ బాగా హాట్ గా నడిచింది. ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా ఆమె చేసిన పనులు వల్ల అక్కినేని కుటుంబానికి మరోసారి తలనొప్పులు వచ్చిన్నట్లు తెలుస్తుంది. అయితే విడాకుల తరువాత సైలెంట్ గా ఉన్న నాగచైతన్య, ఈ మధ్యనే కొంచెం యాక్టీవ్ అవుతూ..చిల్ అవుతున్నాడు.
అయితే ఈ క్రమంలోనే ఫ్యూచర్ గురించి ఆలోచించి..కొత్త బిజినేస్ స్టార్ట్ చేశాడు. ఇక షోయూ పేరుతో హైదరాబాద్‌లో సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. ఇకపోతే దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా సరిగ్గా చై బిజినెస్ స్టార్ట్ చేసిన మూడు రోజులకే సమంత కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసింది. కాగా సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్‌లో ఆమె పెట్టుబడి పెట్టింది.అయితే ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఇక ఇప్పటికే కొన్ని ప్రీ స్కూల్, సాకీ లాంటి బిజినెస్ ఐడియాలతో దూసుకుపోతున్న సామ్ మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టడం అదికూడా చై స్టార్ట్ చేసిన మూడు రోజులకే అనౌన్స్ చేయడంతో ..మీడియాలో మళ్లీ అక్కినేని పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే దీంతో అక్కినేని కుటుంబానికి పెద్ద తలనొప్పిగా మారింది సమంత కొత్త బిజినెస్..!!