పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం 'రాధేశ్యామ్'. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో టి సిరీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు (అనగా మార్చ్11) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధమైంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ నుండి ఓ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీంతో రెండేళ్ల తర్వాత తమ అభిమాన హీరోని వెండితెరపై చూడడానికి ఫాన్స్ వేల సంఖ్యలో థియేటర్లకు తరలివస్తున్నారు. దీంతో ఇప్పుడు థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

థియేటర్ వద్ద చూసినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా ఓరేంజ్ లో కనిపిస్తోంది. చాలాకాలం తర్వాత ప్రభాస్ ఒక కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీతో వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా థియేటర్స్ వద్ద అభిమానులు భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ థియేటర్ వద్ద తీవ్ర అపశృతి నెలకొంది. ఇక ఆ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కారంపూడి లోని ఐమాక్స్ థియేటర్ వద్ద గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

శుక్రవారం మార్చి 11 సినిమా విడుదల సందర్భంగా 37 ఏళ్ల చల్లా కోటేశ్వరరావు అనే ప్రభాస్ అభిమాని ఫ్లెక్సీ కడుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాధేశ్యామ్ సినిమా ప్లెక్సీ పడుతుండగా.. అది హఠాత్తుగా విరిగి పక్కనే ఉన్నా విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఆ ఫ్లెక్సీని పట్టుకున్న కోటేశ్వరరావు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇక ఇదే సంఘటనలో కోటేశ్వరావు తో పాటు మరో ఇద్దరు ప్రభాస్ అభిమానులకు గాయాలైనట్లు సమాచారం. దీంతో వారిని వెంటనే అక్కడి స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక సినిమా విడుదల రోజు ఇలాంటి ఘటన థియేటర్ వద్ద జరగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: