సమంత పేరు ఇప్పుడు అందరికి.. తెలుగు, హింది తో పాటు పలు భాషల్లో కూడా అమ్మడు మంచి పేరును అందుకుంది..సినిమాలు చేయడం వేరు, ఐటమ్ సాంగ్ తో ఫెమస్ అవ్వడం వేరు అన్న విషయం తెలిసిందే.. మొన్నటివరకూ వరుస సినిమా లలో నటిస్తూ వచ్చిన సామ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో నటించి అందరి మన్నలను పొందింది. ఇటీవల పుష్ప' సినిమాలో తను చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావా'పై సమంత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఈ పాటలో నటించడం చాలా ఆనందంగా ఉంది.. ఫస్ట్ కొంచెం భయపడ్డాను కానీ ఇంత మంచి రిజల్ట్ రావడం చూసి చాలా ఆనందంగా వుంది అంటూ సామ్ అంది.


అయితే, ఇప్పుడు ఈ పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఎవ్వరూ ఊహించలేదని సామ్ తెలిపింది. తాజాగా క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సమంత దగ్గరకు పత్రికా వ్యక్తులు వచ్చి ఈ పాట గురించి అడగగా సమంత ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అవి కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.ఆ సాంగ్ కు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు.దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. నేను ఇది కేవలం తెలుగు పాటగానే భావించాను.. కానీ పాన్ ఇండియా స్థాయిలో ఈ పాటకి క్రేజ్ వచ్చింది.


ఎక్కడకు వెళ్ళినా కూడా ఇలాంటి రెస్పాన్స్ రావడం నాకు సంతోషంగా ఉందని సామ్ అంది.గతంలో ఎన్నో సినిమాలు చేశాను..వాటికి ఎక్కడా ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు. నా లైఫ్ ను ఈ పాట మరో స్థాయికి తీసుకెల్లింది.. అంటూ సామ్ చెప్పుకొచ్చింది..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ లో 'పుష్ప2'కి సంబంధించిన షూటింగ్‌పై చర్చలు నడుస్తున్నాయి. ఈ ఏడాది లోనే ఆ సినిమాను విడుదల చెయాలనె ప్లాను లో చిత్రయూనిట్ వున్నారు. ఇక సామ్ కూడా వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: