హీరోల తనయులే కాదట నిర్మాతల తనయులూ కూడా హీరోలు అవుతుంటారు. టాలీవుడ్‌లో ఇటీవల అలా హీరోలు అయినవాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఈ ఫ్లోలో మరో నిర్మాత తనయుడు హీరోగా మారబోతున్నాడని తెలుస్తుంది.

అఖండ' వంటి భారీ హిట్‌ అందించిన మిర్యాల రవీందర్‌ రెడ్డి తనయుడిని హీరోగా పరిచయం చేయాలని గత కొన్ని రోజులుగా చూస్తున్నారట . 'అఖండ' తర్వాత వెంటనే ఆ సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చిన కానీ అవి కార్యరూపం దాల్చలేదట అయితే ఇప్పుడు పక్కాగా ప్లాన్స్‌ వేస్తున్నారని సమాచారం.

 

మిర్యాల తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి. గతంలో ఇంట్రడక్షన్‌ సినిమా చేసిన అనుభవం ఉన్న దర్శకుడినే చూస్తున్నారట. ఈ క్రమంలో మనకు కనిపించే పేర్లు అంటే వి.వి.వినాయక్‌ మరియు ఆ తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల. వినాయక్‌ ఇంట్రడక్షన్‌ సినిమాల మీద మంచి పట్టే ఉందట.ఇక శ్రీకాంత్‌ అడ్డాల అంటే. వరుణ్‌తేజ్‌తో 'ముకుంద' చేశారు. ఆ సినిమాలో వరుణ్‌ను బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్టుగా చూపించారని మెచ్చుకోలు కూడా పొందారు. అందుకే తన తనయుడిని శ్రీకాంత్‌ అడ్డాల చేతిలో పెట్టాలని రవీందర్‌ రెడ్డి అనుకుంటున్నారని సమాచారం.

 

నిజానికి శ్రీకాంత్‌ అడ్డాల కెరీర్‌ అంత సాఫీగా ఏమీ అయితే లేదు. మహేష్‌బాబుతో 'బ్రహ్మోత్సవం' లాంటి డిజాస్టర్‌ ఇచ్చి. ఇండస్ట్రీలో పెద్ద పరాజయం కూడా మూటగట్టుకున్నాడు. బ్రహ్మాండమైన మాస్‌ ఇమేజ్‌ ఉన్న మహేష్‌తో అలాంటి కథ చేయడమేంటి అంటూ విమర్శకులతో మాటలు కూడా పడ్డాడు. ఆ తర్వాత వెంకటేశ్‌తో 'నారప్ప' అనే రీమేక్‌ సినిమా చేశాడు. ఆ సినిమా ఫర్వాలేదనిపించినా కానీ శ్రీకాంత్‌ అడ్డాలకు పెద్దగా ఉపయోపగపడింది లేదు. దీంతో తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్న మొదలైందట.

 

ఆ సమయంలో అతని దగ్గర 'అన్నాయ్‌' అనే సినిమా కూడా ఉందని, గీతా ఆర్ట్స్‌లో ఆ సినిమా చేయాలని కూడా వార్తలొచ్చాయి. ఆ సినిమా మల్టీస్టారర్‌ అని, మంచి హిట్‌ కొట్టాక ఆ సినిమా స్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నారట నిర్మాతలు . మరి గతంలో పరిచయంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్‌ ఈసారి హిట్‌ కొట్టి కెరీర్‌ను మళ్లీ రైట్‌ ట్రాక్‌ మీదకు తెచ్చుకుంటారరట.

మరింత సమాచారం తెలుసుకోండి: