సమ్మర్ బోనంజా ముందుగానే మొదలైంది.. ఈ వేసవిలో సినిమాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. సినీ ప్రేక్షకులను అన్లిమిటెడ్ తో ఎంటర్ టైన్ మెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకోగా.. మరి కొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధమై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. మరి ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఏంటో చూద్దాం.

1). జేమ్స్:
కన్నడ  పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే.. డైరెక్టర్ చైతన్యకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ విలన్ గా నటించారు. ఈ సినిమా మార్చి 17 వ తేదీన విడుదల కానుంది.

2). స్టాండప్ రాహుల్:
యువ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ కలిసి నటిస్తున్న చిత్రం స్టాండప్ రాహుల్. ఈ సినిమాతో నైనా  రాజ్ తరుణ్ అదృష్టం మారుతుందేమో చూడాలి. ఈ చిత్రం ఈ నెల 18వ తేదీన రిలీజ్ కానుంది.

3). నల్లమల్ల:
నటుడు అమిత్ తివారి, భానుశ్రీ జంటగా నటిస్తున్న సినిమా.. నల్లమల్ల ఈ సినిమాని డైరెక్టర్ బచ్చన్ పాండే దర్శకత్వం వహించారు. ఈ సినిమా 18వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఓటిటి లో విడుదలయ్యే సినిమాలు:
1).సెబాస్టియన్:
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ  చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ సినిమా మార్చి 18వ తేదీన ఆహ లో విడుదల కానుంది.

2). సెల్యూట్:
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో కూడా ఈ హీరోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ నెల 18న ఈ చిత్రం సోనీ లైవ్ లో విడుదల కానుంది.

3). జల్సా:
విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం ఈనెల 18వ తేదీన అమెజాన్ లో విడుదల కానుంది.

అలాగే ఆహ లో ఈనెల 18న జూన్ తెలుగు సిరీస్ విడుదలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: