తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన డైరెక్టర్లలో డైరెక్టర్ పరశురామ్ కూడా ఒకరు. ఎప్పుడు రొటీన్ కథలనే కాకుండా విభిన్నమైన కథలను తెరకెక్కించడంలో దర్శకుడు ముందుంటాడని చెప్పవచ్చు. మొదటగా తన సినీ కెరీర్ నే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇక ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసినట్లు సమాచారం. ఆ తరువాత 2008 వ సంవత్సరంలో యువత సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా మారాడు పరశురామ్. ఈ సినిమా యావరేజ్ గా నిలిచి మంచి విజయాన్ని అందుకుంది.


ఇక ఆ తర్వాత రవితేజ తో ఆంజనేయులు, నారా రోహిత్ సోలో, రవితేజ సారొచ్చారు వంటి సినిమాలు తెరకెక్కించ గా అన్ని యావరేజ్ గా నిలిచాయి.. కానీ విజయ్ దేవరకొండ తో తెరకెక్కించిన గీతగోవిందం సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఒకేసారి మహేష్ బాబు తో సినిమాను తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు ఈ డైరెక్టరు. ప్రస్తుతం మహేష్ బాబు తో కలిసి సర్కారు వారి పాటని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. అయితే ఈ సినిమా అయిపోగానే తన తదుపరి సినిమాని ఒక హీరోతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు అ హీరో నాగ చైతన్య. నాగచైతన్యతో డైరెక్టర్ పరుశురామ్ తన తదుపరి చిత్రాన్ని నిర్మించబోతున్నారు అని ఇండస్ట్రీలో టాక్ గా వినిపిస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించవలసి ఉన్నది. ఏది ఏమైనా డైరెక్టర్ పరశురామ్ తీసిన తక్కువ సినిమాలలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎదిగిపోయారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు తెరకెక్కిస్తున్న సినిమా పై చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి: