సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల వారసులు ఎలాంటి కష్టం లేకుండా ఇండస్ట్రీలోకి సులభంగా ప్రవేశిస్తారు  అనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే ఇండస్ట్రీలో సులభంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకోగలరు. చాలామంది స్టార్ కిడ్స్ వారి తల్లిదండ్రులు లాగా స్టార్ స్టేటస్ ని అందుకోకపోవడానికి కారణం అదే. ఇక టాలీవుడ్ లో నిర్మల కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాల నటుడిగా హీరోగా రెండుసార్లు సినీ రంగ ప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రోషన్..

నటన పరంగా ఆకట్టుకున్నా.. కమర్షియల్గా మాత్రం విజయాన్ని అందుకోలేక పోయాడు. దీంతో ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త సినిమాలతో నైనా బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో తన పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మార్చుకుంది పూర్తి పేరు కాదు. తన పేరులోని స్పెల్లింగ్ను "Roshan" నుండి "Roshann"గా మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం తన పేరులో అదనంగా 'n' అనే పదాన్ని చేర్చుకున్నాడు. ఇక గతంలో చూసుకున్నట్లయితే స్టార్ హీరోయిన్ తమన్నా, యాంకర్ ఓంకార్ కూడా ఇలాగే చేశారు. అయితే ఈ ఇద్దరికీ అలా పేరు మార్చుకోవడం కలిసి వచ్చిందని చెప్పాలి. కానీ ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలు మాత్రం పేరు మార్చుకున్న ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు.

ఇటీవల మెగాహీరో సాయిధరమ్తేజ్ తన పేరు నుండి 'ధరమ్' ను తీసివేయగా.. అతని సోదరుడు వైష్ణవ్ తేజ్ తన పేరులో ఆదరంగా 'h' అనే పదాన్ని జోడించాడు. అయినా కూడా వైష్ణవ్ ఇటీవల కొండపొలం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. మరి ఇప్పుడు తాజాగా పేరు మార్చుకున్న యంగ్ హీరో రోషన్ తన కొత్త సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. ఈ పేరు మార్పు శ్రీకాంత్ తనయుడు రోషన్ కి కలిసి వస్తుందా? లేదా అన్నది కూడా తన కొత్త సినిమా తోనే తేలిపోనుంది. అన్నట్టు రోషన్ తన కొత్త సినిమాని అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: