బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత భారీ సినిమాలకు పెట్టింది పేరు సంజయ్ లీలా భన్సాలీ. అలాంటి ప్రముఖ వ్యక్తిని ఈమధ్య అల్లు అర్జున్ స్వయంగా ముంబాయ్ వెళ్ళి కలవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఇప్పుడు ఈవార్త పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ‘పుష్ప’ మూవీ హిందీలో ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా తారా స్థాయికి వేరుకుంది.



ఈమూవీలోని అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ బాలీవుడ్ యూత్ కు విపరీతంగా నచ్చడంతో బన్నీ మార్కెట్ బాలీవుడ్ లో బాగా పెరిగిపోయింది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ‘పుష్ప 2’ ను పార్ట్ వన్ కు మించిన స్థాయిలో రూపొందిస్తున్న పరిస్థితులలో ఈమూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.



దీనితో జోష్ లోకి వెళ్ళిపోయిన అల్లు అర్జున్ బాలీవుడ్ లో తన మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో భాగంగానే ఈమధ్య బన్నీ ముంబాయి వెళ్ళి సంజయ్ లీలా బన్సాలీని కలవడం అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ ఉంటుంది అని అంటున్నారు. ఈమూవీ ప్రాజెక్ట్ ను స్వయంగా అల్లు అర్జున్ నిర్మిస్తాడు అని టాక్.



బన్సాలీ సినిమాలు అంటే వందల కోట్ల స్థాయిలో ఉంటాయి. ఆయన సినిమాలలో కళ్ళు చెదిరిపోయే సెటింగ్స్ ఉంటాయి. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో అలాంటి భారీ రేంజ్ సినిమా ఉంటుందా అన్నసందేహాలు వస్తున్నాయి. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ కు వరసపెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితులలో ఈగ్యాప్ ను ఉపయోగించుకోవడానికి బన్నీ చాల తెలివిగా అడుగులు వేస్తున్నాడు అనుకోవాలి. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత చరణ్ జూనియర్ లకు కూడ బాలీవుడ్ లో మంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ముందుగానే ఊహించుకుని బన్నీ ఇలా వ్యవహరిస్తున్నాడు అనుకోవాలి..





మరింత సమాచారం తెలుసుకోండి: