టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోల సినిమాలు ఒక్కసారిగా గందరగోళంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం కరోనా. కరోనా ముందు వరకు కూడా అందరు హీరోలు తమ సినిమాల విడుదల పట్ల మంచి ప్రణాళికలు వేసుకున్నారు. సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలను విడుదల చేసే విధంగా రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వారి అంచనాలు అన్నీ కూడా తారుమారయ్యాయి అని చెప్పవచ్చు.

చాలా మంది హీరోలు ఇప్పుడు వరుస ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ వాటి విడుదల విషయంలో ఎలాంటి సమాధానం చెప్పలేకపోతన్నారు ప్రేక్షకులకు. మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు వంటి హీరోల సినిమాలు ఇంకా విడుదల కాకపోవడం భారీ సమస్యగా మారిందని చెప్పవచ్చు. చిరంజీవి సైరా సినిమా చేసి దాదాపు మూడేళ్లు దాటుతుంది. ఆయన హీరోగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు కానీ నీ విడుదలవడం మాత్రం జరగడం లేదు. దాంతో మెగా అభిమానులు దీని పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

మహేష్ బాబు కూడా తన సరిలేరు నీకెవ్వరు సినిమాను విడుదల చేసి రెండు సంవత్సరాలు దాటుతుంది. ఈ నేపథ్యంలో హీరో ఇంతకీ తన సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ ను పూర్తి చేయకపోవడం సంవత్సరాల తరబడి షూటింగ్ చేస్తూ ఉండటం వల్ల అసలు మహేష్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఎప్పుడు చూస్తామో అన్న ఆలోచనలో ఉన్నారు ప్రేక్షకులు. కరోనా తర్వాత కూడా కొంత మంది హీరోలు తమ సినిమాల విడుదలను ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటే వీరిద్దరు మాత్రం ఎందుకు వాటిని విడుదల చేసే విషయంలో ఇంత జాప్యం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఆచార్య సినిమా ఏప్రిల్ 29 న విడుదల అవుతుండగా మహేష్ కూడా మే లో సినిమా ను విడుదల చేస్తున్నాడు. మరి చిరంజీవి మహేష్ లు ఫ్యూచర్ లో ఇలాంటివి మిస్ అవకుండా చూసుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: