
అయితే బన్నీతో జక్కన్న సినిమా తీయాలని కోరుకున్న అభిమానుల కల నేడు నిజమయ్యింది. దర్శకుడు రాజమౌళితో బన్నీ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం ఎలా ఉండబోతుంది ? హీరోయిన్ ఎవరు ? స్టోరీ ఏంటి ? అన్న అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ఈ విషయాలపై చర్చ నడుస్తోంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబందించి ఒక న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా స్టోరీ ఒక ప్రముఖ నవలను ఆధారంగా చేసుకుని బిల్డప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక అద్భుతమైన ప్రేమ కథ...అలాగే మాయాజాలంతో కూడిన కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ నవలను ఆధారంగా చేసుకుని అందులోని మెయిన్ థీమ్ ను తీసుకుని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ రొటీన్ టాపిక్ అయినప్పటికీ అందులో కొత్తదనాన్ని చూపుతూ పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కించడానికి యోచిస్తున్నారట జక్కన్న. మరి ఈ ప్రాజెక్ట్ నుండి ఇంకా పూర్తి స్థాయిలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉన్నాయి.