తమిళంలో స్టార్ హీరోగా పేరు పొందిన నటుడు విజయ్ ఆంటోని.. మొదటిసారిగా బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే తన పేరుని ఆంటోని గా మార్చుకున్నాడు. ప్రస్తుతం బిచ్చగాడు -2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలిమ్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమా తో దర్శకుడిగా మారుతున్నాడు విజయ్ ఆంటోని. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నారు.


ఇందులో కథానాయికగా కావ్య దపర్  నటిస్తోంది. దీంతో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక థీమ్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఇక ఆ సాంగ్ లో అత్యంత ఆసక్తికరంగా సాగుతూ ఉంది. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే ఇందులో రోల్స్ రాయిస్ కార్ లో దిగుతూ అద్భుతమైన నటన ప్రదర్శించారు విజయ్ ఆంటోని. అలాగే ఒక హోటల్ గది లోకి వెళుతూ బిచ్చగాడు మేకప్ వేసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆటోలో నుంచి బయటకు వెళ్తారు. అతని వెళుతున్నది మాత్రం యాంటీ బికిలీ మిషన్ అని తర్వాత తెలుస్తుంది.

ఈ మిషన్ ఏంటనేది తెలియాలి అంటే ఈ సినిమా కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక అంతే కాకుండా ఇందులో కొన్ని డైలాగులు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సందేశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఈ థీమ్ సాంగ్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగిందని చెప్పవచ్చు. బిచ్చగాడు సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీంతో బిచ్చగాడు-2 ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అందరి అంచనాలను కారణంగానే ఈ సినిమా విజయ్ ఆంటోని తెరకెక్కించి ఉంటాడనే నమ్మకం ఎంత మంది లో ఉన్నది. అయితే సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: