నానితో కలిసి శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటించిన ఈమె ఆ సినిమా లో చేసిన గ్లామర్ షో కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈమె లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అందరు ఆశ్చర్యపోయారు. బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించి అందరిని అలరింప చేసింది ఈ ముద్దుగుమ్మ. అలా రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మూడో సినిమా బంగార్రాజు కూడా ఆమెకు డీసెంట్ హిట్ ను తీసుకొచ్చింది. ఏదైతేనేం తెలుగు సినిమా పరిశ్రమకు మరొక కత్తిలాంటి హీరోయిన్ దొరికింది ఈమె రూపంలో అని చెప్పాలి.
ఇప్పుడు కూడా ఈమె చేతిలో మంచి మంచి సినిమాలే ఉన్నాయి. రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ సినిమాలో ఆమె హీరోయి న్ గా నటిస్తుంది. లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ మసాలా చిత్రంగా రాబోతుండగా ఇందులో గ్లామర్ కథానాయికగా ఆమె ఏ స్థాయి లో అందరిని అలరిస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్న నేపథ్యంలో కొంతమంది క్రేజీ హీరోలు ఆమె తో సినిమా చేయాలంటే వెయిట్ చేయాల్సి వస్తుందట. ఇందులో పెద్ద హీరోలు ఉండడం గమనార్హం. మరి కృతి శెట్టి వారందరిని ఎలా సంతృప్తి పరుస్తుందో చూడాలి.