తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో  సోషల్ మీడియా ద్వారా అంతకు మించి పాపులారిటీని అయితే సంపాదించుకుంది.

ప్రగతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో  ఎప్పుడు పంచుకుంటూ ఉంటుంది. సినిమాలలో సాంప్రదాయ పద్ధతిలో కనిపించె ఈమె రియల్ లైఫ్ లో మాత్రం హాట్ గా ఫోజులు ఇస్తూ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య సోషల్‌ మీడియాల్లో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటు ట్రెండింగ్‌ పాటలకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ వీపరితమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు సంపాదించుకుంటోంది. ఇక ఈ రోజు ప్రగతి పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లాలో జన్మించిన ఈమె నటనపై ఎక్కువగా ఆసక్తి ఉండడంతో మోడల్గా కెరీర్ ను ప్రారంభించిందట.అలా మొదట తమిళ నటుడు దర్శకుడు అయిన భాగ్యరాజా సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. అలా మొదటిసారిగా వీట్ల విశేశాంగ సినిమాతో ప్రగతి హీరోయిన్ గా తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ సినిమాల్లో కూడా నటించిందట.

ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొంతకాలం నటనకు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలు పోషిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఏర్పరుచుకుంది. అలా తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ కెరీర్పరంగా బాగా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె తెలుగు లో వందకు పైగా సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా కూడా రెండు నంది అవార్డులు కూడా దక్కించుకుంది. అలా తమిళంలో 23 మలయాళం రెండు సినిమాలు కూడా చేసింది. ఇకపోతే ప్రగతీ ప్రస్తుతం ఎఫ్ 3, బోలా శంకర్ సినిమాల్లో నటిస్తూ ఆమె బిజీ బిజీగా ఉంది. ఇటీవల సూపర్ మచ్చి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందట ప్రగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: