ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఎదురుచూస్తున్న చిత్రం ఏది అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది kgf-2 చిత్రమేనని చెప్పవచ్చు.. ఈ సినిమా మొదటి భాగం విడుదల అయ్యి ఇప్పటికి దాదాపుగా మూడు సంవత్సరాలు పైనే అవుతోంది.. అయినా ఇప్పటికీ ఈ చిత్రం బుల్లితెరపై టిఆర్పి రేటింగ్ పరంగా మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. దాంతో పార్ట్ -2 పై చాలా ఆతృతతో ఉన్నారు అభిమానులు. అయితే ఈ సినిమా నుంచి అప్పుడప్పుడు కొన్ని పోస్టర్లు, టీజర్లు మాత్రమే అప్డేట్ వచ్చాయి. ఇక ఇందులో నటించే నటీనటుల షూటింగ్, డబ్బింగ్ పనులు పూర్తి అయిన వెంటనే వారికి సంబంధించిన విధంగా ఒక పోస్టర్ ను విడుదల చేస్తూనే ఉన్నారు.


కానీ ప్రేక్షకులు , అభిమానులు మాత్రం ఈ చిత్రం నుంచి ఏదైనా ఒక ట్రైలర్ విడుదల చేస్తే బాగుంటుందని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ చిత్ర బృందం త్వరలోనే ఒక అప్డేట్ ఇస్తామని తెలియచేస్తోంది తప్ప సినిమా నుంచి ఎటువంటి అప్డేట్  ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త బాగా వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే కేజిఎఫ్ సినిమా ని అన్ని భాషలలో డిజిటల్ రైట్స్ ను zee -5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ఈ సినిమా విడుదలైన ఆరు వారాల తరువాత ఈ సినిమాని స్ట్రీమింగ్ చేసుకోవచ్చని తెలిపినట్లుగా సమాచారం. ఇక అంతే కాకుండా ఈ రోజున ఒక భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం .

మరి సినిమా నుంచి ఈ రోజు ఎలాంటి అప్డేట్  వస్తుందో అంటూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలై ఎంతటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక పార్ట్ -1 కూడా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డులను సైతం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: