ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాకు విడుదల రోజున నెగిటివ్ టాక్ వచ్చిందనే విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ గత సినిమా సాహో నెగిటివ్ టాక్ తో కూడా రికార్డు స్థాయిలో అయితే కలెక్షన్లను సాధించడంతో రాధేశ్యామ్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ అందరూ కూడా భావించారు.

ప్రభాస్ మరియు పూజా హెగ్డేలకు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని ప్రభాస్ అభిమానులు అందరూ కూడా అనుకున్నారు. అయితే ప్రభాస్ రాధేశ్యామ్ విడుదలై వారం రోజులు కావడంతో ఈ సినిమా తుది ఫలితం ఏమిటో తేలిపోయింది.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం తర్వాత రాధేశ్యామ్ కేవలం 500 స్క్రీన్లకు పరిమితమైందని తెలుస్తుంది.. ఈ సినిమా కనీసం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద సాధిస్తుందని ఆశించిన ప్రభాస్ అభిమానులకు మాత్రం నిరాశ అయితే తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు 55 కోట్ల రూపాయలుగా ఉన్నాయని సమాచారం.

రాధేశ్యామ్ సినిమా రోజుకు కోటి రూపాయల కంటే తక్కువ కలెక్షన్లు సాధిస్తుండగా ఆదివారంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్టేనని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా ఏ మాత్రం కూడా ప్రభావం చూపలేదు. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుంటే రాధేశ్యామ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం అయితే చూపలేదు. రాధేశ్యామ్ ఫ్లాప్ కాగా సూర్య నటించి విడుదలైన ఈటీ మాత్రం నెగిటివ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అయితే అయింది. ఏడు రోజుల్లో రాధేశ్యామ్ కేవలం 82 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా నష్టాలను మిగిల్చిన సినిమాలలో రాధేశ్యామ్ సినిమా కూడా ఒకటని ఫ్యాన్స్ అందరూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: