సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే దర్శకుడు తన భర్త అయితే లేదా నిర్మాత తన భర్త అయితే ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలోనే సినిమాలలో నటించాలని ఆసక్తి చూపుతుంటారు . కానీ మన డర్టీ బ్యూటీ విద్యా బాలన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. విద్యాబాలన్ హిందీ,  బెంగాలీ సినిమాలలో నటించి ఎవరు ఊహించని విధంగా పాపులారిటీని సొంతం చేసుకుని ఎంతో మంది అభిమానులను పోగు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక  సినిమాలతోనే కాదు సీరియల్స్ తో  కూడా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. కేరళలో జన్మించిన విద్యాబాలన్ ముంబైలో పెరిగి హమ్ పాంచ్ అనే హిందీ సీరియల్ ద్వారా నటిగా తన కెరీర్ మొదలు పెట్టింది.

ఇక అసలు విషయంలోకి వెళితే ఆమె తన భర్త సినిమాలో మాత్రం నటించడానికి ఒప్పుకోవట్లేదు.. ఈ విషయం గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. విద్యాబాలన్ ప్రముఖ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను  వివాహం చేసుకుంది . ఇక ఈయన బ్యానర్లో ఘన్ చక్కర్ అనే సినిమాలో విద్యాబాలన్ నటించింది. ఇక ఈ సినిమా తరువాత ఈమె తన భర్త బ్యానర్ లో ఒక్క రోజు కూడా ఒక సినిమాలో కూడా ఆమె నటించలేదు. ఇందుకు గల కారణం ఏమిటంటే విద్యాబాలన్ తన భర్త బ్యానర్లో తాను నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఇందుకు గల కారణాలు కూడా అభిమానులు వెతుకుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే తన భర్త బ్యానర్ లో నటించి ఆ సినిమా మంచి విజయం సాధిస్తే ఆ క్రెడిట్ మొత్తం తన భర్త కి వెళ్తుంది అని.. తన విజయాలను ఎవరైనా తక్కువ చేసి చూపిస్తే తను తట్టుకోలేనని.. అందుకే తన భర్త బ్యానర్ లో నటించే ప్రసక్తే లేదని విద్యాబాలన్ తెలిపింది.ఇకపోతే ఈ స్టేజ్ కి రావడానికి తామిద్దరం ఎంతో కష్టపడ్డాము  అని.. ఒకరి సక్సెస్ ప్రభావం మరొకరిపై పడకూడదు అని  సొంత బ్యానర్ లో నటించడం లేదు అని ఆమె చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: