సంక్రాంతికి కోడి పందేలు ఎన్నికల సమయంలో ఎలక్షన్స్ రిజల్స్ పై అదేవిధంగా క్రికెట్ మ్యాచ్ ఫలితాల పై బెట్టింగ్స్ జరగడం సర్వసాధారణ విషయం. అయితే ఒక భారీ సినిమా కలక్షన్స్ పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో మాత్రమే కాకుండా జూనియర్ చరణ్ అభిమానుల మధ్య కూడ ఆసక్తికర చర్చలతో పాటు పందేలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం ఈమూవీకి మొట్టమొదటిరోజు 200 కోట్లు గ్రాస్ కలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే ఈసినిమాకు మొట్టమొదటిరోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉందని అంటున్నారు. అంతేకాదు ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఓపెన్ అయిన రెండు గంటలలోపే మొదటి మూడు రోజులకు టిక్కెట్లు అన్నీ హాట్ కేక్స్ లా అమ్మకం జరుగుతుందని మరొక అంచనా.





ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాయడం ఖాయం అని అంటున్నారు. ఇక ఈమూవీకి సంబంధించి ఇంట్రవెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ తో ఈమూవీ పూర్తి కాకుండానే బ్లాక్ బష్టర్ హిట్ టాక్ బయటకు వస్తుందని అంటున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ 3గంటల 6నిముషాలు వచ్చింది అంటున్నారు.



స్వాతంత్ర ఉద్యమ నేపధ్యంలో జరిగే కథ కాబట్టి ఈమూవీ నిడివి ఎంత ఎడిట్ చేసినా కొంతమేరకు మాత్రమే తగ్గించగలిగారు కానీ పూర్తిగా తగ్గించాలేకపోయారు అన్న మాత్రము కూడ వినిపిస్తున్నాయి. ఊహించన విధంగా ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వస్తే ఈమూవీని ప్రపంచ వ్యాప్తంగా మొదటివారం పూర్తి చేసుకునే సరికి 500 కోట్ల గ్రాస్ సాధించడం చాల సులువు అన్న అంచనాలు కూడ ఉన్నాయి. అయితే ఈ అంచనాలు అన్నీ సగటు ప్రేక్షకుడు ఈమూవీకి కనెక్ట్ అవ్వడమే కాకుండా ప్రతి సగటు ప్రేక్షకుడు ఈమూవీని కనీసం రెండు సార్లు చూసినప్పుడు మాత్రమే రాజమౌళి కోరుకుంటున్న 1000 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది..  




మరింత సమాచారం తెలుసుకోండి: