దాదాపు 4 ఏళ్ల పాటు శ్రమించి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో సావాసం చేసిన రాజమౌళి బాధ్యత మార్చి 25 వ తేదీతో తీరనుంది. దీంతో తన తరువాత సినిమా పై ఇప్పటి నుంచే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత రాజమౌళి టాలీవుడ్‌ సూపర్ స్టార్ ప్రిన్స్‌ మహేష్‌ బాబు తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి తర్వాతి సినిమాపై అనేక వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి.ఈ సినిమాకి సంబంధించి రైటర్‌ విజయేంద్ర వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఉండనుందని చేసిన ప్రకటనతో సినిమాపై ఇప్పటి నుంచే చాలా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న మహేష్‌ ఆ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తో మొదలు పెట్టనున్నారు. ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడం లేదా ఒకే కాలంలో ఇద్దరి సినిమాలో నటించనున్నారా అనేది తెలియాల్సి ఉంది.


సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ వార్త ప్రకారం మహేష్‌ ఇంకా రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్నారని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కేవలం గెస్ట్ రోల్‌కే పరిమితం కాదని సినిమాలో సుమారు 20 నిమిషాలకుపైన బాల కృష్ణ కనిపించనున్నారని సమాచారం. ఇది మల్టీ స్టారర్ అని కూడా అప్పుడు చెప్పుకొచ్చారు.ఇక బెంగళూరులో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో భాగంగా యస్ యస్ రాజమౌళి మట్లాడుతూ.. ఈ సినిమా మల్టీ స్టారర్ కాదని ఈ సినిమా సోలో హీరో నేపథ్యంలో సాగుతుందని ఆయన అన్నారు. దీంతో ఈ వార్త తెలిసిన సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోను రాజమౌళి దర్శకత్వంలో సోలోగా చూసుకోవచ్చని తెగ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: