బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'త్రిబుల్ ఆర్' మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలున్నాయి. ఇక సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ కథానాయకులుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ శ్రీయా శరణ్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధమైంది. 

ఈ క్రమంలోనే ఈ పాన్ ఇండియా సినిమాని జనాల్లో తీసుకెళ్లి ఎందుకు రాజమౌళి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ ని ప్లాన్ చేశాడు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి వరస ప్రెస్ మీట్ లు స్పెషల్ ఇంటర్వ్యూ లకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఎన్టీఆర్ రామ్ చరణ్ లను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా తారక్, చరణ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ఎన్టీఆర్ ని కీరవాణి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అందులో యాంకర్ సుమ కి మీ సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారు అని కీరవాణి ఎన్టీఆర్ ని అడగగా..

 దానికి ఎన్టీఆర్ బదులిస్తూ..' సుమకు కొంచెం చాదస్తం ఎక్కువ. ఊరికే నోరు పారేసుకుంటుంది. ఆమెను చూడగానే గయ్యాళి అత్త పాత్రలు గుర్తుకు వస్తాయి. అందుకే సుమకు నాయనమ్మ లేదా అమ్మమ్మ లాంటి ముసలమ్మ పాత్రలను ఇవ్వాలి' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు తారక్. ఇక ఇదే ప్రశ్నను రామ్ చరణ్ ని అడగగా సుమకు పంచాయితీలను పరిష్కరించే మధ్యవర్తి పాత్రను ఇవ్వడం కరెక్ట్ అని అన్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు యాంకర్ సుమ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: