ఇంకొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచంలో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు జక్కన్న అభిమానులు గత రెండు సంవత్సరాలుగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఈ విషయంలో సందేహం లేదు. కానీ ఓవరాల్ గా కలెక్షన్ ల విషయంలోనే చిత్ర బృందం టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు అని ఇప్పటికే ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సందు ఫస్ట్ రివ్యూ చెప్పేశాడు. కాగా కర్ణాటక లో నిన్న నుండి ఆర్ ఆర్ ఆర్ పై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలో ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని పునీత్ రాజ్ కుమార్ అభిమానులు నిన్న సోషల్ మీడియా ద్వారా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా జక్కన్న స్పందించారు. రాజమౌళి మాట్లాడుతూ మీకు ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడాలని ఎంత ఆశగా ఉంది అనేది మేము అంతా అర్థం చేసుకోగలము. మాకు ఆ భాష ఈ భాష అని తేడా లేదు. ప్రతి భాషలోనూ అభిమానులను సంపాదించుకోవడమే మా లక్ష్యం. కానీ కర్ణాటకలో కొన్ని థియేటర్ లు వాళ్ళు ఆర్ ఆర్ ఆర్ కన్నడ భాషలో ప్లే చేసేందుకు అయిష్టంగా ఉన్నారని వారితో మాట్లాడి ఒప్పించడానికి మా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

అంతే కాకుండా కర్ణాటకలో ఉన్న కెవిఎన్ ప్రొడక్షన్స్ వారు ఎలాగైనా రేపు రిలీజ్ సమయానికి ఎటువంటి పరిస్థితుల్లో స్క్రీన్ పై కన్నడ భాషలో మూవీ వస్తుందని హామీ ఇచ్చారు. మరి రేపు కర్ణాటకలో సినిమా విడుదల అవుతుందా లేదా అన్నది తెలియాలంటే రేపు ఉదయం వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: