'ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు కూడా తీయనటువంటి చెత్త సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇక దీన్ని పొరపాటు అని నేను అనను. ఇది చాలా పెద్ద నేరం. రూ. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఇటువంటి చెత్త సినిమా తీసినందుకు గాను రాజమౌళిని ఆర్నెల్లు జైల్లో పెట్టాలి' అని కమల్ ఆర్. ఖాన్ ట్వీట్స్ చేశాడు.హైదరాబాద్‌లో బెనిఫిట్ షోలు పూర్తి కాకముందే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా షోస్ స్టార్ట్ కాకముందే డైరెక్టర్ రాజమౌళిపై, 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ట్విట్టర్ వేదికగా ఇతగాడు ఇలా దారుణంగా విరుచుకుపడ్డాడు. మరోసారి దక్షిణాది సినిమాపై ఉన్న తన అక్కసును అంతా కూడా వెళ్లగక్కాడు.
'ఆర్ఆర్ఆర్' సినిమా అట్టర్ ప్లాప్ అని ఆమిర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'తో ఇతడు కంపేర్ చేశాడు. ఇక చాలా మంది కూడా అతని సమీక్షలను సీరియస్‌గా తీసుకోనప్పటికీ ఆర్.ఆర్.ఆర్ సినిమాగురించి కమల్ R ఖాన్ ఏమి ట్వీట్ చేసాడో చూడండి.ప్రస్తుతం ఇతగాడి ట్వీట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతూ దూమారం రేపుతున్నాయి.