దేశం మొత్తం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా దక్షిణాది మెగా టైగర్ మల్టీస్టారర్ మూవీ ఇంకా ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాను నాలుగేళ్ళ నిరీక్షణకు తెరదింపుతూ ఈరోజు (మార్చి 25వ తేదీ)న ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చారు మేకర్స్. ఇక ఇప్పటికి సినిమా రచ్చ రచ్చ చేస్తుంది.మొదటి రోజు ఖచ్చితంగా 200 కోట్లు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయంలా అనిపిస్తుంది. ఇద్దరి స్టార్ హీరోలను ఒకేసారి తెరపై చూడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అసలు అవధులు అనేవి లేకుండా పోయాయి.4 సంవత్సరాలు వీళ్ళు పడిన కష్టమంతా కూడా తెరపై కనపడింది.ఎమోషనల్ డ్రామాలో కింగ్ అయిన యస్ యస్ రాజమౌళి మరొకసారి ఆర్ఆర్ఆర్ సినిమాతో తన మార్కు చూపించారు. ఒక నటుడి లోని నటనని వెలికితీయగల సమర్ధవంతమైన డైరెక్టర్ దొరికితే ఎలా ఉంటుందో మరొకసారి నిరూపించబడిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిందంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. 


సెలబ్రెటీలు, నటీనటులు ఇంకా సినీ ప్రేక్షకుల వరకూ ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంకా రాజమౌళిలు తమ ఫ్యామిలీలతో సహా ఆర్ఆర్ఆర్ టీమ్ బెనిఫిట్ షోలను చూశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమాను హైదరాబాద్ లోని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా థియేటర్ AMB సినిమాస్ లో చూసారు. చిరంజీవి తల్లి అంజనా దేవి, కూతుర్లు సుష్మిత , శ్రీజ ఇంకా అలాగే మనువరాళ్ల తో కలిసి మెగాస్టార్ చిరంజీవి తనయుడు సినిమాను చూశారు. ఇక ఈ సందర్భంగా  చిరంజీవి ఇంకా సుష్మితలు ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.నటి నటులను చిత్ర బృందాన్ని బాగా మెచ్చుకున్నారు. ఇక ఆలిండియా మొత్తం కూడా ఆర్.ఆర్.ఆర్ ఫీవర్ పాకి పోయింది. బాహుబలి తరువాత తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి మరో సారి జక్కన్న చూపించారంటూ సెలబ్రెటీలు ఇంకా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: