యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన చివరి చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు హీరో. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ డైరెక్షన్ లో ఒక సినిమాని చేయబోతున్నారు. ఆ సినిమా పేరు అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు సినీ కెరియర్ లో ప్రేమ కథ చిత్రం, సమ్మోహనం, శ్రీదేవి సోడా సెంటర్ వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే ఇప్పుడు తాజాగా సరికొత్త చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునెలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు ఒక యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మహేష్ డైరెక్షన్లో  వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు గత నెల రెండో వారంలో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు.

ఈ సందర్భంగా నిర్మాత వి ఆనంద్ మాట్లాడుతూ.. సుధీర్ బాబు హీరోగా శమంతకమణి చిత్రం తర్వాత మా సంస్థలో పని చేస్తున్న చిత్రం ఇదే ఆని తెలియజేశారు. ఈ చిత్రం ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుంది అని తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టాం.. ఈ సినిమా ఏప్రిల్ 23 వరకు షెడ్యూల్ కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదని తెలిపారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారట. ఒక కీలకమైన పాత్రలో హీరో శ్రీకాంత్, భరత్, సురేష్ తదితరులు కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: