టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా సమంత అతనికి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పింది. నితిన్ సమంత కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అ ఆ' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సమయంలో నితిన్ సమంత ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత నితిన్ పుట్టినరోజు సందర్భంగా అతనకి బర్తడే విషెస్ ను అందించింది.

 ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సమంత పోస్ట్ చేస్తూ..' హ్యాపీ బర్త్డే టు మోస్ట్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్.నిన్ను ఫ్రెండ్ అని పిలవడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలి. గాడ్ బ్లెస్స్ యు' అంటూ సమంత పోస్ట్ పెట్టింది. దీంతో సమంత చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే నాగ చైతన్య తో విడాకుల తర్వాత చైతు పుట్టినరోజున సమంత చైతన్య కి విషెస్ చెప్పలేదు. కానీ తనతో కలిసి నటించిన నితిన్ కి మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక మరోవైపు సమంతతో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు నితిన్ కి బర్త్ డే విషెస్  అందజేస్తున్నారు. ఇక నితిన్ పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమా నుంచి టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా విడుదలైన టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: