దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు మొదలుకొని సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఇక అసలు విషయంలోకి వెళితే అంతలా క్రేజ్ ఏర్పడిన ఈ సినిమాకు ఒకచోట మాత్రం ప్రేక్షకులే లేకుండా పోయారు. అయితే అదీ ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు.. హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం.ఇకపోతే హైదరాబాద్ పాతబస్తీలోని ఓ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ షోకి ప్రేక్షకులు కరువయ్యారట. అయితే ఉదయం 7గంటల షోకి అసలు బుకింగ్స్ లేకపోవడంతో థియేటర్ యాజమాన్యం ఏకంగా షోని రద్దు చేసిందట.

ఇక ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే సైతం ఉదయం 7గంటల షో, 11 గంటల షోలు మాత్రమే హౌస్ ఫుల్ అయ్యాయట. కాగా మిగతా షోలకు అంతంతమాత్రం స్పందనే కనిపించదట.అయితే ఓవైపు హైదరాబాద్‌లోని థియేటర్లలో టికెట్లు దొరక్క ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటే.. మరోవైపు అదే హైదరాబాద్‌లోని పాతబస్తీ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రేక్షకులు కరువవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇకపోతే ఇప్పటికీ అక్కడ ఆర్ఆర్ఆర్‌కి ప్రేక్షకుల నుంచి స్పందన ఓ మోస్తరుగా మాత్రమే ఉందట. ఇక ఓవైపు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా పాతబస్తీలో ఈ పరిస్థితిని ఎదుర్కోవడం విచిత్రంగా అనిపిస్తోంది.

కపోతే ఈ నెల 25న ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమాతో నటులుగా చరణ్, ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కారని... రాజమౌళి మరోసారి తన దర్శకత్వ ప్రతిభ ఏంటో చూపించాడని కొనియాడుతున్నారు. ఇదిలావుండగా కలెక్షన్ల పరంగా విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.615 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చెబుతున్నారు.అయితే  హిందీలో ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ని దాటేసినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: