యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే వరుస సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ఎంతగానో ఆనంద పరుస్తున్నాడు.ఇక తాజాగా భారీ  మల్టీస్టారర్, పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25 2022 లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమా  విడుదలకు ముందే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే విడుదల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ తో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సందడి చేస్తోంది.ఇకపోతే ఎన్టీఆర్ దాదాపు మూడేళ్ల పాటు సినిమాకి పని చేసాడు .అయితే  ఇక రానున్న రోజులలో రచ్చ చేయనున్నాడు. ఇకపోతే ఇప్పటికే కొరటాల శివతో మూవీ ఓకే చేసిన ఎన్టీఆర్ త్వరలో బుచ్చిబాబుతో పాటు పలువురి డైరెక్టర్స్‌తో కూడా పని చేయనున్నాడు.

ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఎఫ్ 3 డైరెక్టర్ అనీల్ రావిపూడితో కూడా కలిసి పని చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనిల్ రావిపూడి ఎఫ్ 3 షూటింగ్ పూర్తి చేసి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం చివర్లో ప్రారంభమవుతుంది . కాగా 2023 వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.ఇకపోతే తాజాగా దిల్ రాజు ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ మీటింగ్‌లో ఎన్టీఆర్- అనీల్ ప్రాజెక్ట్ చర్చుకు వచ్చింది. కాగా తారక్ కూడా కొంతకాలంగా కామిక్ ఎంటర్‌టైనర్ చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. ఇక అందుకే అతనితో కలిసి పని చేసేందుకు ఆసక్తి చపుతున్నట్టు తెలస్తుంది.

అయితే అనుకున్న ప్రకారం పనులు జరిగితే వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది.ఇక ఇదిలా వుండగా గతంలో ఎన్టీఆర్  యమదొంగ, సింహాద్రి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. అయితే పూరీ దర్శకత్వంలో రెండోసారి నటించిన 'టెంపర్' మూవీతో ఎన్టీఆర్ వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు. దాని అనంతరం ఎన్టీఆర్ 2015 ఫిబ్రవరి 13న ఈ చిత్రం రిలీజ్ అయి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అంతేకాకుండా రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టగా రూ.74కు పైగా వసూళ్లు చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: