ఇక కృతి శెట్టి 'ఉప్పెన' సినిమాతో కుర్రకారును కవ్వించేసింది. బాక్సాఫీస్ బేబమ్మగా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటోంది. రాత్‌తో 'ది వారియర్', నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు చేస్తోంది. లవ్‌స్టోరీస్‌తో బిజీగా ఉన్న కృతి తర్వాత విరంచి వర్మ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు అనుపమ పరమేశ్వరన్ ఇప్పటి వరకు ప్రేమ కథా చిత్రాల్లోనే నటించింది. యూత్‌ఫుల్ స్టోరీస్‌తో మెప్పించింది. అయితే మొదటిసారి 'బటర్‌ఫ్లై' సినిమాతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోకి వెళ్లింది. అలాగే ఈ మూవీ తర్వాత మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీకి సైన్ చేసినట్టు సమాచారం. మళయాళీ ఫిల్మ్ 'హెలెన్' రీమేక్‌కి అనుపమ ఓకే చెప్పిందట.
సాధారణంగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రయోగాలు చేయాలి. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్‌కి భిన్నంగా వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తేనే జనాలు మనసుల్లో నాటుకుపోతారు. అందుకే చాలామంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నివేదా థామస్ టాప్ హీరోస్‌తో భారీ సినిమాలు చేయకపోయినా.. బెస్ట్ పెర్ఫామర్ అనే గుర్తింపు ఉంది. తక్కువ సినిమాలు చేసినా, యాక్టింగ్‌తో జనాలకి దగ్గరైంది. ఇప్పుడీ ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'శాకిని డాకిని' చేస్తోంది.
తమిళ్లో హీరోయిన్‌గా చేసి, సపోర్టింగ్ రోల్‌తో తెలుగు ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది వరలక్ష్మి శరత్‌కుమార్. 'నాంది, క్రాక్' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి నెక్ట్స్ 'ఆద్య' అనే హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. అలాగే 'యశోద, హను-మాన్' సినిమాల్లో కీ-రోల్స్ ప్లే చేస్తోంది వరలక్ష్మి. రెజీనా 'శాకిని డాకిని' సినిమాలో మరో హీరోయిన్‌గా చేస్తోంది. సరైన హిట్స్‌లేక సపోర్టింగ్ రోల్స్‌కి షిఫ్ట్ అయిన రెజీనా 'శాకిని డాకిని'తో కొత్త టర్న్ తీసుకుంది. మరి స్టార్ హీరోలతో పాటు, కుర్రహీరోలు కూడా పక్కనపెట్టేశాక చేస్తోన్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో రెజీనా మళ్లీ బిజీ అవుతుందా అనేది చూడాలి.