ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల అమ్మకాలు విషయంపై సరికొత్త విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతోంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల పోర్టల్ కాంట్రాక్టు మెగా కాంపౌండ్ కు చెందిన ఒక సంస్థ తీసుకోబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.. అయితే ఈ విషయాన్ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా జస్ట్ టికెట్ సంస్థ టెండర్ వేయడంతో ఏపీ సర్కారు కూడా ఆన్లైన్ టికెట్ విధానాన్ని వీటికే అప్ప చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆల్లు బాబీ స్పందించడం జరిగింది..


ఈ నేపథ్యంలో తాజాగా గని సినిమా ప్రమోషన్లలో నిర్మాత అల్లు బాబి మాట్లాడడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ ను రూపొందించడానికి టెండర్ వేసిన విషయాన్ని తను అంగీకరించారు. గతంలో టికెట్ దాదా అనే ఆన్లైన్ టికెట్ పోర్టల్ ను తాము రూపొందించామని చెప్పారు బాబి. ఇప్పుడు దానిని జస్ట్ టికెట్ పేరుతో నిర్వహించబోతున్న ట్లుగా వెల్లడించారు. సినిమాలను శాటిలైట్ ద్వారా ఆన్ని థియేటర్లకు అందిస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లపై పారదర్శకంగా తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ మంచిది అని తెలిపారు. అయితే టెండర్ లో కూడా జస్ట్ టికెట్ సమస్త పాల్గొని అల్లు బాబీ వెల్లడించారు.

ఆన్లైన్ టికెట్ పోర్టల్ కోసం టెండర్ వేసిన అల్లు బాబి స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే జగన్ సర్కార్ జస్ట్ టికెట్ కె ఈ బాధ్యతలను అప్పగించినట్లు గా కూడా దాదాపుగా ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి అని తెలిపారు. అయితే ఇ టెండర్లలో జస్ట్ టికెట్ మాత్రమే తక్కువ కోర్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు బాబి కంపెనీ అందించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఖర్చుతోనే ఈ కాంట్రాక్ట్ వచ్చిందే తప్ప.. ప్రభుత్వ పెద్దల పరిచయాల వల్ల ఇది రాలేదని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: