టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ డైరెక్టర్లకు కొదవలేదు. ప్రేక్షకులను తమ టెక్నిక్ తో ఎంతగానో అలరించే ఈ దర్శకు డు ఇప్పుడు మంచి మంచి కథలు ఉన్న సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. అలా మంచి ప్రతిభ మంచి టెక్నిక్ మంచి రచన విలువలను కలిగి ఉన్న దర్శకులలో ఒకటు ప్రవీణ్ సత్తారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దొరికిన ఒక ఆణిముత్యం లాంటి దర్శకుడు ప్రవీణ్ సత్తరు అని చెప్పవచ్చు.

ఆయన తొలి చిత్రం LBW తో ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాడు. అయితే మొదట్లో చిన్న సినిమాలను చేసిన ఆయన వాటి ద్వారా పెద్ద హీరోల దగ్గర నమ్మకం సాధించి ఆ తరువాత క్రమక్రమంగా పెద్ద హీరోలతో సినిమాలు చేసే దర్శకుడు గా ఎదిగాడు. రాజశేఖర్ తో కలిసి ఆయన చేసిన గరుడవేగ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తో అటు రాజశేఖర్ తో పాటు ఈ దర్శకుడు కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ విధంగా ఇప్పుడు నాగార్జునతో కలిసి ఓ అదిరిపో యే ప్రాజెక్టును చేపట్టాడు ప్రవీణ్ సత్తారు.

 ఘోస్ట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తుందని చిత్ర బృందం నమ్ముతుం ది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తవడంతో ఈ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అప్డేట్ వల్ల సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే ఈ దర్శకుడు ఈ సినిమా పూర్తి చేయకముందే మరిన్ని సినిమాలను చేయాలనీ ఫిక్స్ అవడం అందరిని ఎంతో ఆశ్చర్య పరుస్తుంది. రాజశేఖర్ తో మరొక సినిమాన్ చేయబోతున్న ఈ దర్శకుడు ఆ తర్వాత రామ్ పోతినేని తో ఓ సినిమా చేయబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: