టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల అయ్యి సక్సెస్ ఫుల్ గా మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది.భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది.ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఫస్ట్ వీక్ లో 180+ కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారతదేశపు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'బాహుబలి 2' సినిమా మొదటి వారంలో 117.77 కోట్లు షేర్ అందుకొని.. లాంగ్ రన్ లో 153 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లోనే 'బాహుబలి 2' రికార్డును అధిగమించింది. రేపు ఉగాది పండుగ ఉండటంతో ఈ వీకెండ్ లో మరిన్ని వసూళ్ళని అంచనా చేయొచ్చు. అయితే మిగతా అన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



నార్త్ మార్కెట్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరగా.. మొదటి వారం పూర్తయ్యే నాటికి ఈ సినిమా 131 కోట్లు కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే హిందీలో ఎక్కువ రేటుకే సినిమాని అమ్మడం వల్ల బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోడానికి ఇంకా వసూళ్లు రాబట్టాల్సి ఉంది.యూఏస్ఏలో అయితే ప్రీమియర్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటి వరకు 11 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా ఖచ్చితంగా 15 మిలియన్ డాలర్ల వరకూ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.ప్రస్తుత ట్రెండ్ చూస్తే ఆర్.ఆర్.ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా సెంటర్లలో 'బాహుబలి 2' వసూళ్లను అధిగమించడం కష్టమేమో అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా ఎలాంటి వసూళ్ళని రాబడుతుందో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: