భారతీయ సినిమా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ ‘బాలీవుడ్’. మనదేశంలోని ముంబై నగరంలో బాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే యునైటెడ్ స్టేట్స్ లోని లాస్ ఏంజిల్స్ లోని మెట్రోపాలిస్ పరిసరాల్లో ప్రపంచ సినిమా రాజధాని హాలీవుడ్ ఉంది. హాలీవుడ్‌లో హైటెక్, ఎకానమీ కారణంగా అత్యుత్తమ యానిమేషన్, ఎపిక్, వార్ సీన్స్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ వంటి సినిమాలను నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో డ్రామా, రొమాన్స్, యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ వంటి సినిమా నిర్మిస్తూ వాటిపైనే ఆధారపడి ఉన్నారు.

 

బాలీవుడ్, హాలీవుడ్‌లలో ఒకదానికొకటి పలు తేడాలు ఉన్నాయి. ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చూసినట్లయితే ఈ తేడాలను మీరు కూడా గమనించి ఉండవచ్చు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాను చిత్రీకరించినప్పటి నుంచి సినిమా ప్రమోషన్స్ వరకు సినిమాకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగిస్తారు. అయితే లైట్ కలర్స్‌ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.


బాలీవుడ్‌లో ఇండస్ట్రీలో గమనించినట్లు అయితే.. సినిమాల్లో కాస్ట్యూమ్స్ నుంచి సెట్స్ వరకు ప్రతిదీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సాధారణంగా హాలీవుడ్‌లో ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమాలు, సాంప్రదాయ సినిమాలు ఎక్కువగా కనిపించవు. ప్రతిదీ మోడ్రన్ కల్చర్‌కు దగ్గరగా ఉండేలా సీన్స్ ఉంటాయి. కానీ బాలీవుడ్‌లో సాంప్రదాయలకు పెట్టింది పేరు. దీపావళి, హోలీ, తదితర అన్ని పండుగలను, పెళ్లి వేడుకలను, ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కిస్తుంటారు.


బాలీవుడ్ సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగా ఉండాలి. మానవీయ కోణంలో చిత్రీకరించే సినిమాలు అధికంగా ఉంటాయి. ఎమోషనల్స్ సీన్స్ చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. అయితే హాలీవుడ్‌లో నటీనటులకు తమ ముఖాల్లో భావోద్వేగాలు చూపించరు. ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపించవు. హాలీవుడ్‌లో కామెడీ చిత్రాలలో ప్రధాన పాత్రకు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తారు. బాలీవుడ్‌లోనూ కామెడీ పుష్కలంగా ఉంటుంది. సెటేర్లు, జోకులు, సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయి. అలాగే హాలీవుడ్‌లో పాటలు బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతాయి. కానీ బాలీవుడ్‌లో ప్రత్యేకంగా పాటలు ఉండవు. సినిమా కథలోనే భాగమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: