'ఇండియన్2' సినిమా శంకర్‌ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. 'టు పాయింట్ ఓ' ఫ్లాప్ అయ్యాక లైకా ప్రొడక్షన్స్ శంకర్‌కి చాలా పరిమితులు పెట్టిందని, 'ఇండియన్2' బడ్జెట్‌లో కోత పెట్టిందనే కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ వివాదం కోర్టు వరకు వెళ్లడంతో శంకర్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇంతకుముందులా ఈ దర్శకుడు ఎంత బడ్జెట్ అడిగితే అంత బడ్జెట్ ఇచ్చే నిర్మాతలు కూడా తగ్గిపోతున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్‌తో ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ తీస్తున్నాడు. సోషల్ మెసేజ్‌తో కమర్షియల్ హిట్ కొడతాడని మురుగదాస్‌కి సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ ఇమేజ్ ఉంది. అందుకే బాలీవుడ్ జనాలుక కూడా ఈ దర్శకుడిని ముంబాయి తీసుకెళ్లారు. అక్కడ 'గజిని'తో ఆమిర్ ఖాన్‌ని వందకోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే 'అకీరా, స్పైడర్' ఫ్లాపులతో మురుగదాస్ గ్రాఫ్‌లో తేడాలొచ్చాయి. రజనీకాంత్‌తో తీసిన 'దర్బార్' కూడా అంచనాలు అందుకోలేకపోయింది.
మురుగదాస్ 'దర్బార్' తర్వాత మరో సినిమా అనౌన్స్ చెయ్యలేదు. కానీ అల్లు అర్జున్‌తో ఒక సినిమా తీస్తాడనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఒక ఫాంటసీ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాడని ఈ సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుందని టాక్ వస్తోంది. మరి ఈ సినిమాల్లో మురుగదాస్ ఏ ప్రాజెక్ట్‌ని ముందు స్టార్ట్ చేస్తాడో చూడాలి. బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ అనగానే రాజ్‌కుమార్ హిరాణీ పేరు చెప్తారు. ఈ దర్శకుడు సినిమా చేస్తే ఇండస్ట్రీ హిట్ గ్యారెంటీ అని ట్రేడ్ పండిట్స్‌లోనూ ఒక నమ్మకముంది. ఇక రాజమౌళి అయితే 'బాహుబలి' తర్వాత ఒక బ్రాండ్‌లా మారిపోయాడు. జక్కన్నతో సినిమాలు చెయ్యడానికి తెలుగు హీరోలంతా పోటీ పడుతున్నారు. అయితే తమిళనాట మాత్రం ఇలాంటి నమ్మకమిచ్చే దర్శకులు తగ్గిపోయారంటున్నారు కోలీవుడ్ జనాలు.
మణిరత్నం సినిమా వస్తుందంటే ఇండియన్ సినీ లవర్స్ అంతా థియేటర్లకి చేరిపోయేవాళ్లు. మణి మ్యాజిక్ కోసం సినీజనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు. కానీ 'రావణ్' సినిమా నుంచి మణిరత్నం అభిమానుల్లో డిసప్పాయింట్ స్టార్ట్ అయ్యింది. 'కాట్రు వెలియిదై, చెక్క చివంత వానమ్' ఫ్లాపులతో మణిరత్నం మార్కెట్ కూడా పడిపోయింది.