రష్మిక మందన.. చలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించింది. తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక దర్శక నిర్మాతలు చూపు కూడా తనవైపు తిప్పుకొని వరస సినిమా లతో దూసుకు పోతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ సొగసరి అటు నార్త్ లో కూడా పాగా వేసేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నార్త్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ సత్తా చాటుతోంది.


 అంతేకాదు ఇటీవల కాలంలో ఈ అమ్మడు పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ సాధిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే తమ సినిమాల్లో రష్మికను మన్నాను పెట్టుకోవాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు సిద్ధమైపోతున్నారు. ఈ అమ్మడు కాస్త  భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదట. ఇక ఇటీవల కాలంలో రష్మిక మందన కాస్త గ్లామర్ డోసు కూడా పెంచడంతో ఇక దర్శక నిర్మాతలు అందరికీ ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది రష్మిక మందన. ఇక ఇప్పుడు నేషనల్ క్రష్  రష్మిక మందన కాస్త ప్రస్తుతం మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది అన్నది తెలుస్తుంది.



 అర్జున్ రెడ్డి ఫ్రేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో క్రైమ్ డ్రామా చిత్రం యానిమల్  తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా లో రష్మిక మందన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. గీతాంజలి అనే పాత్రలో ఇక ఈ సినిమాలో కనిపించబోతుందట ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం పరిణీతి చోప్రాను తీసుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ హీరోయిన్ తప్పుకోవడంతో ఇక ఆఫర్ కాస్త రష్మిక మందన ను వరించింది. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ అనిల్ కపూర్ బాబీ డియోల్ ప్రధానపాత్రలో నటిస్తూ  ఉండడం గమనార్హం. 2023 ఆగస్టు 11వ తేదీన ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: