హన్సిక మాట్లాడుతూ తనకు విభిన్నమైన స్క్రిప్ట్ లు అంటే ఎంతో ఇష్టమని.. మరి ఇంత వైవిధ్యం గా ఉండేలా తనని తాను తీర్చిదిద్దుకోగలనని తెలియజేసింది. ఒకవేళ తన అందానికి తగ్గట్టు గా ఏదైనా గ్లామర్ పాత్ర వచ్చినా కూడా చేయడానికి వెనుకాడని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి స్పందిస్తూ తన 50వ చిత్రం మహా త్వరలోనే విడుదల కాబోతోంది అని తెలిపింది. ఇక తాజాగా ఇటీవలే తనకు సంబంధించిన 55వ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా మొదలైందని తెలిపింది.
ఇక అంతే కాకుండా ఓటీటీ లు వచ్చాక ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు బాగా పెరిగిపోయాయని తను కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుందని తెలియజేసింది. ఇక ఇటీవల కాలంలో హన్సిక దర్శకత్వం వైపు కూడా అడుగులు వేస్తోందని వార్తలు బాగా వినిపించాయి. అయితే ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైనా చిత్రాన్ని డైరెక్షన్ చేయాలంటే అది పెద్ద టాస్క్ లాంటిది.. నేను దర్శకత్వం వైపు అసలు వెళ్లలేదని ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది హన్సిక. ప్రస్తుతం మై నేమ్ ఈజ్ శృతి,105 మినిట్స్ వంటి సినిమాలలో నటిస్తుందట.