త్రిబుల్ ఆర్ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల మార్చి 25న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని ప్రపంచవ్యాప్తంగా అందుకుంది. ఈ సినిమా హిట్ అవడంతో ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్.జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తను నటిస్తున్న సినిమాలకు దాదాపుగా 70 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం.అయితే ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు స్టార్ డైరెక్టర్లు, పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లు మాత్రమే దర్శకులుగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక ఇదిలా ఉంటె తాజాగా ముంబైలో ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ ను ధరించి కనిపించగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ఖరీదు కోటీ 70 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది.కాగా కళ్లు బైర్లు కమ్మే రేటుకు తారక్ ఈ వాచ్ ను కొనుగోలు చేయడం గమనార్హం. అయితే తారక్ కు సాధారణంగానే వాచీలంటే ఇష్టం..

 కాగా ఈ వాచ్ విదేశాలకు చెందిన బ్రాండెడ్ వాచ్ కావడం గమనార్హం. ఇకపోతే ఈ ఖరీదైన వాచ్ పేరు patek philippe nautilus 5712 1/a కాగా ఈ బ్రాండ్ కు సంబంధించిన ప్రతి వస్తువు ఖరీదైనదే అని సమాచారం.అంతేకాకుండా గతంలో కూడా ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ తో కనిపించగా ఆ వాచ్ ధర 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ జూన్ నెల నుంచి కొరటాల శివ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కొరకు తారక్ ప్రస్తుతం లుక్ మార్చుకునే పనిలో పడ్డారు. ఇకపోతే కొరటాల శివ సినిమాలో స్టూడెంట్ గా కనిపించాల్సి ఉండటంతో తారక్ కొత్త లుక్ పై దృష్టి పెట్టారని బోగట్టా...!!

మరింత సమాచారం తెలుసుకోండి: