రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని నీరసం నిండిన పాత్రల్లో చూసేందుకు అస్సలు ఇష్టపడటంలేదు. ఆ విషయం 'రాధేశ్యామ్' సినిమాతోనే బాగా ప్రూవ్ అయ్యింది.

నిజాని కి, 'రాధేశ్యామ్' సినిమా కేవలం ప్రభాస్ అభిమానుల కు మాత్రమే నచ్చలేదని తెలుస్తుంది.. అందుకు గల కారణం, పాన్ ఇండియా సూపర్ స్టార్ నుంచి ఎంతో ఎనర్జిటిక్ ఔట్‌పుట్‌ని ఆయన అభిమానులు ఆశించడమే.

ప్రభాస్ అంటే ఎలా వుండాలి.? ఒక పెద్ద ఆటంబాంబులా వుండాలి. 'సాహో' సినిమాలో యాక్షన్ దంచేసి నా కానీ అక్కడక్కడా డల్ మూమెంట్స్ వుంటాయి. ఆ సినిమా ఫ్లాప్ అయినా అభిమానుల్ని బాగా అలరించింది. 'రాధేశ్యామ్' పరిస్థితి అత్యంత దారుణం. ఈ నేపథ్యంలో హై ఆక్టేన్ ఎనర్జిటిక్ మూవీ ప్రభాస్ నుంచి రావాలన్నది అభిమానుల డిమాండ్ అని సమాచారం.

కాగా, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమా తెరకెక్కున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ఏంటంటే, ఈ సినిమా కూడా రెండు పార్టులుగా తెరకెక్కబోతోందని తెలుస్తుంది.. ఇందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రభాస్‌ ని నీరసం పాత్రల్లో చూపించొద్దంటూ ప్రశాంత్ నీల్ ముందు డిమాండ్లు కూడా వుంచుతున్నారట అభిమానులు.

మరోపక్క, తన కెరీర్‌లో నే అత్యంత పవర్ ఫుల్ పాత్ర ను ప్రభాస్ కోసం రాశాన నీ, 'సలార్' సినిమాలో ప్రభాస్‌ని చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారనీ ప్రశాంత్ నీల్ అంటున్నాడట. నిజమే నా.? నమ్మొచ్చా.? 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' వచ్చాక ఈ విషయమై మరింత స్పష్టత వచ్చేయనుందని తెలుస్తుంది.ప్రభాస్ అంటే భారీ యాక్షన్ తో కూడిన ఫైట్ సీన్స్ అలాగే భారీ యాక్షన్ డైలాగ్స్ తో ఉంటే అభిమానులకు పండగే. కానీ గత రెండు సినిమాలలో అలాంటి పాత్రలు లేకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ బాగా హర్ట్ అయ్యారు.అందుకే రాబోయే సినిమాలకు భారీ డిమాండ్స్ ఇస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: