మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే థియేటర్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాని ఓటీటీలో మళ్ళీ ఎవరు చూస్తారు అని చాలామంది అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేసింది ఈ సినిమా.

గత ఏడాది నుండి అన్ని రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విడుదల అయిన సినిమాలను పరిశీలించగా.. సౌత్ ఇండియాలోని ఓటిటిలో టాప్ పర్ఫార్మర్ గా అఖండ సినిమా నిలిచింది.. ఈ మేరకు త్వరలోనే అఫీషియల్గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఈ విషయాన్ని ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఇక ఓటీటీ లోను బాలయ్య నటించిన అఖండ సినిమాకి అఖండమైన రెస్పాన్స్ రావడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా..

 శ్రీకాంత్, జగపతి బాబు, పూర్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. తమన్ మ్యూజిక్ కి థియేటర్లో ఉన్న బాక్సులు బద్దలై పోయాయి. అందుకే అఖండ చిత్రానికి ఈ రేంజిలో రెస్పాన్స్ దక్కింది. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్లో అఖండ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ పడింది. ఇక అఖండ చిత్రానికి సీక్వెల్ కూడా తీసే ఆలోచనలో ఉన్నట్టు దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇక అఖండ సీక్వెల్ కోసం కూడా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నట్టు బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమా చేస్తున్నాడు. NBK07 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: