అయితే సాధారణంగా హీరో విజయ్ తన సినిమా ప్రచారాలకు చాలా దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ బీస్ట్ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఒక ఇంటర్వ్యూలో హీరో విజయ్ వీటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. తను ఎందుకు ప్రెస్ మీట్ కు దూరంగా ఉంటారు అనే విషయం గురించి కూడా తెలియజేయడం జరిగింది. చాలా ఏళ్ళ క్రితం ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగింది.
అయితే గతంలో తను మాట్లాడిన మాటలకు బదులుగా ఇతర మాటలను మీడియా వాళ్లు వ్రాసి విడుదల చేశారని తెలియజేశారు. ఆ వార్తలను అతను మరుసటి రోజున చూసి చాలా బాధపడ్డాను అని తెలియజేశాడు విజయ్. అయితే ఈ మాటలను తన స్నేహితులు కూడా చూసి విజయ్ ఇలా మాట్లాడుతాడు అని అనుకోలేదు అని తెలియజేశారు అట. తాను అనని మాటలను కూడా అన్నారు అనే విధంగా రాశారని దీంతో అప్పట్లో ఈయనపై చాలా విషయాలు రూమర్ లుగా మారాయని తెలియజేశారు విజయ్. అయితే తను ఏం మాట్లాడాడు అనే విషయం మాత్రం తన ఇంట్లో వాళ్లకు మాత్రమే తెలుసు అని.. ఆ కారణంగానే అప్పటినుంచి మీడియాకు చాలా దూరంగా ఉంటున్నాను అని విజయ్ తెలిపారు.