సాధారణంగా కొంత మంది హీరోయిన్ల పై సోషల్ మీడియాలో నెటిజన్లు శృతిమించిన కామెంట్స్ చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక హీరోయిన్ల శరీరాకృతి పై, వారి డ్రెస్సింగ్ సెన్స్ పైన వారికి తోచిన విధంగా కామెంట్ చేస్తూ ఉంటారు నెటిజన్స్.. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇలాంటి వారిపై ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మరికొంతమంది మాత్రం ఇలాంటి వాటిని చూసి చూడకు ఉన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు. ముఖ్యంగా కెరీర్ ఆకృతిపై దారుణమైన ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటుంది.

అయితే తాజాగా బాడీ షేమింగ్ గురించి.. హీరోయిన్ ప్రియమణిపై దారుణమైన ట్రోలింగ్ చేయడం  జరిగిందట. అయితే ఈ విషయంపై ప్రియమణి స్పందిస్తూ.. ఇలాంటి ట్రోలింగ్ పై.. ఏ విషయం వచ్చిన దానిని మనం స్వీకరించాలని.. ప్రస్తుతం ఉన్న ఏజ్ పట్ల సానుకూలంగా ఉండాలని తెలియజేసింది ప్రియమణి. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూ లో సోషల్ మీడియాలో వచ్చిన ఈ విషయంపై స్పందించడం జరిగింది. సోషల్  మీడియాలో వస్తున్న ఇలాంటి మీమ్స్ చూసి చాలా ఎంజాయ్ చేసే దానిని అని తెలియజేస్తుంది. అయితే కొన్ని సార్లు వచ్చే కామెంట్ల వల్ల తనని తాను జీర్ణించుకోలేక వాటిని బ్లాక్ చేసే దానిని అని తెలిపింది ప్రియమణి.


సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి జీవితం కాదు.. తను కేవలం అభిమానులకు ఏం చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతాను అని తెలియజేసింది. అయితే ఆ విషయాలను వారు అంగీకరించి స్వీకరిస్తే పరవాలేదు.. కానీ కొంతమంది మాత్రం.. ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి చెప్పే అధికారం ఏదైనా ఉంటుంది అని తెలియజేసింది. అయితే ఎన్ని రూమర్స్ వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా కేవలం అవసరమైన వాటిపైనే దృష్టి ని పెట్టి మనకు ఇష్టమైన పని చేసి ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసింది ప్రియమణి. అందుకోసం కొన్ని వ్యాయామాలు, శ్రమతో కూడిన ఇంటి పనులు చేయండి అంటూ తెలియజేసింది ప్రియమణి.

మరింత సమాచారం తెలుసుకోండి: