థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాల విషయానికి వస్తే..
బీస్ట్ : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ , పూజా హెగ్డే హీరోయిన్ గా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 13వ తేదీన విడుదల కాబోతుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, పాటలు మంచి హిట్ అయ్యాయి.
కే.జీ. ఎఫ్. చాప్టర్ -2:
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. తెలుగులో ఈ మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇందుకు సంబంధించి ప్రోమోలు, ట్రైలర్లు కూడా సూపర్ హిట్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగే అవకాశం ఉంది అని అంచనాలు పెరుగుతున్నాయి.
ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాల విషయానికి వస్థే..
ఆడవాళ్లు మీకు జోహార్లు : ఏప్రిల్ 14 వ తేదీన సోనిలివ్ లో స్ట్రీమ్ కాబోతోంది.
బ్లడీ మేరీ: ఈ మూవీ ఏప్రిల్ 15 వ తేదీ న ఆహాలో ప్రసారం కాబోతుంది.
గాలివాన : సాయికుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14 నుండీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.