ఈమధ్య ఒక కేంద్రమంత్రి దేశప్రజలు అంతా ఆంగ్ల భాషకు బదులు హిందీ భాష మాట్లాడాలి అంటూ చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి. ఈవిషయమై దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎందరో ప్రముఖులు స్పందిస్తూ వారివారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం పై భారతదేశం గర్వింప తగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనదైన రీతిలో స్పందించాడు.


తన దృష్టిలో తమిళ భాష చాల తియ్యగా ఉంటుందని అలాగే తెలుగువారు కన్నడ మళయాళ ప్రాంతాలకు చెందిన వారు వారివారి భాషలు చాల గొప్పవిగా ఉంటాయని భావిస్తారని అందువల్ల దేశవ్యాప్తంగా ప్రజలు అందరు హిందీ భాషను మాత్రమే మాట్లాడాలి అన్న నినాదం ఆచరణయోగ్యం కాదని ఘాటుగా స్పందించాడు. అంతేకాదు భారతదేశం నుండి పూర్తిగా ఇంగ్లీష్ ను తొలగించడం అయ్యే పని కాదంటూ ఉత్తరాది ప్రాంతానికి చెందిన హిందీ భాషను పూర్తిగా దక్షిణాది ప్రజలు స్వాగతించలేరు అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేసాడు.




ఇదే సందర్భంలో 7 సంవత్సరాల క్రితం ఒక చైనా వ్యక్తి తన పై చేసిన కామెంట్స్ ను కూడ బయటపెట్టాడు. ఆ చైనా వ్యక్తి తనతో మాట్లాడుతూ తనకు నార్త్ ఇండియన్స్ అంటే చాల ఇష్టం అనీ వాళ్ళు చాల అందంగా ఉంటారని అంటూ వాళ్ళు నటించిన సినిమాలు కూడ బాగుంటాయి అంటూ కామెంట్స్ చేసారట.


అయితే అప్పుడు ఆచైనా వ్యక్తి చేసిన కామెంట్స్ విని అప్పట్లో తాను చాల బాధ పడ్డానని దేశప్రజలు అంటే కేవలం ఉత్తరాది వారు కాకుండా దక్షిణాది వారు కూడ ఉన్నారు అన్న విషయం చైనాలో ఉన్నవారికి తెలియదా అంటూ తనకు బాధ కలిగిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఇక తన వరకు ఎలాంటి భాషా భేదం లేదనీ అదేవిధంగా తనకు ఉత్తరాది దక్షిణాది అన్న ఫీలింగ్స్ కూడ లేవని చెపుతూ ఒక ప్రాంతం వారి భాషను మరొక ప్రాంతం వారి పై రుద్దితే ప్రజల మనోభావాలు దెబ్బతినే ఆస్కారం ఉంది అంటూ రెహమాన్ అభిప్రాయపడుతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: