ఎవరైనా దర్శకుడు తాను పని చేసిన హీరోలను పొగడం సహజమే. బాగా నచ్చితే ఆ హీరో బాగా చేశాడు అని అంటారు. ఇంకా బాగా నచ్చితే ఆ హీరో కంటే ఎవరు బాగా చేయలేరు అని కూడా అంటారు కానీ ఓ దర్శకుడు మాత్రం తాను పనిచేసిన హీరోల కంటే ఓ  హీరో ఎంతో అద్భుతంగా చేశాడు అని ఇండైరెక్టుగా చెప్పి సదరు హీరో పై ఉన్న అభిమానాన్ని తెలియజేశాడు. ఆ విధంగా అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు.

కామెడీ మీద ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన సినిమాలలో చూసిన వారికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు డైరెక్ట్ గా ఆయనకు పేరు రాకముందే రచయితగా మంచి గుర్తింపు ఉంది అలా కళ్యాణ్ రామ్ తో కలిసి ఆయన పటాస్ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన రవితేజ సాయి ధరంతేజ్ హీరోలతో సినిమాలు చేసి దర్శకుడు గా ఎదిగాడు. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో కలిసి చేసిన ఎఫ్ 2 సినిమా మంచి విజయం తెచ్చి పెట్టగా ఆయనకు మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం చాలా తక్కువ సమయంలోనే వచ్చింది.

ఈ విధంగా అనిల్ రావిపూడి ఇప్పటివరకు తాను పనిచేసిన హీరోల కంటే ఎక్కువగా మహేష్ బాబు తో పని చేయడాన్ని మరిచిపోలేనని ఆయన చెప్పాడు. డైరెక్టర్ ఎవరైనా సరే సినిమా ను ఆయన భుజాన పెట్టుకుని నెత్తిన పెట్టుకొని మరి పని చేస్తాడు అని చెప్పారు. ఒకసారి కథ నచ్చింది అని చెప్పిన తర్వాత ఇక ఏ విషయంలో ఆయన జోక్యం చేసుకోడు అని  అన్నారు. దర్శకుడు ఏదైతే చెబుతాడు అది చేస్తాడు . ఒకసారి మహేష్ బాబు గారి తో సినిమా చేస్తే మళ్లీ మళ్లీ ఆయనతో చేయాలనిపిస్తూ ఉంటుంది అని అన్నారు. ఆయన చాలా మంచి మనిషి అని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఎఫ్3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు. ఎఫ్2 సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: