ప్రస్తుతం ఎక్కడ చూసినా? ఏ నోట విన్నా ? రెండు సినిమాల గురించే మాటలు వినపడుతున్నాయి. అందులో ఒకటి దర్శకుడి రాజమౌళి నుండి జాలువారిన ఆణిముత్యం "ఆర్ ఆర్ ఆర్" మూవీ కాగా మరొకటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ చాప్టర్ -2. ఈ రెండు సినిమాలు ఇపుడు బాక్స్ ఆఫీస్ లను కొల్లగొడుతూ పోటాపోటీగా వసూళ్లను అందుకుంటున్నాయి. అయితే ఇపుడు తాజాగా విడుదల అయిన కేజీఎఫ్ చాప్టర్ -2 మంచి హైప్ పై ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతిభను తప్పకుండా పొగిడి తీరాల్సిందే. అలాగే హీరో యశ్ కూడా ఏమాత్రం తగ్గకుండా తన పవర్ ను పర్ఫార్మెన్స్ లో కనబరిచారు.

సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ తదితర నటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు అనేకంటే ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రంలో ముఖ్యంగా ఫైట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ ప్రేక్షకులను అబ్బుర పరుస్తున్నాయి. ముఖ్యంగా హీరో యశ్ డైలాగ్స్ కి  ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. డైలాగులు పవర్ ఫుల్ గా ఉండటమే కాదు ఆ వాయిస్ లో అంతకు మించిన పవర్ ,స్టైల్ వినపడుతోంది కూడా. అంతేకాదు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందే అని అనిపిస్తుంది కూడా... అయితే ఇంతకు హీరో యశ్ కి తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరయ్యా అంటే... అతడు మరెవరో కాదు టాలీవుడ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రావు అలియాస్ వాసు.

ఈయన సాధారణంగా తమిళ్ యంగ్ హీరోల డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో డబ్ చెబుతుంటారు. చాలా వరకు తమిళ హీరోలకు కళాకారుడు వాసు నేమ్ తెలుగులో డబ్బింగ్ చెప్తుంటారు.  ఇప్పటి వరకు తమిళ స్టార్ హీరోలు అయిన ధనుష్, లారెన్స్, జీవ, విజయ్ సేతుపతి వంటి నటులకు వాసు డబ్బింగ్ చెప్పారు. అలా ఈయన వాయిస్ మనకు బాగా సుపరిచితమే అన్నమాట . అందుకే ఈ చిత్రం లో యశ్ డైలాగ్స్ చెబుతున్న సమయంలో మనకు బాగా కనెక్ట్ అయిన వాయిస్ అన్న భావం కలుగుతుంది. అందుకే ప్రేక్షకులు డైలాగ్స్ కు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: