లండన్లో మైఖేల్ అనే వ్యక్తి తో కొద్ది రోజులు ప్రేమాయణం నడిపింది. అయితే ఇక తననే వివాహం చేసుకోబోతోంది అని పలు మీడియాలో కూడా వార్తలు బాగా వినిపించాయి. అయితే కొన్ని విభేదాల కారణంగా చివరకు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. ఈ బ్రేకప్ వల్ల తను చాల డిప్రెషన్ కు గురైనట్లుగా వార్తలు కూడా వినిపించాయి శృతిహాసన్ మీద. ఆ తర్వాత తిరిగి మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టి ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది.
సోషల్ మీడియాలో కూడా తరుచు యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియాలో తను ఉపయోగించిన దుస్తులను ఏం చేస్తుందో తెలియజేసింది. ఎవరైనా సెలబ్రిటీస్ ఒకసారి వాడిన దుస్తులను తిరిగి వాడరు. కానీ అలా వాడిన దుస్తులను పక్కకి పడేయకుండా వాటితో మనీ సంపాదిస్తోంది శృతిహాసన్. అయితే ఆ డబ్బులను తన ఉపయోగించుకోకుండా సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తానని తెలియజేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభాస్, బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోల చిత్రాల లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.