తమిళ సినీ పరిశ్రమను తెలుగు సినీ పరిశ్రమతో పోలుస్తూ.. కోలీవుడ్ వెనకడుగులు వేస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ శరవేగంగా దూసుకుపోతోందని తెలుగు సినీ పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు ఒక తమిళ దర్శకుడు. తెలుగు సినిమానే అగ్రస్థానంలో ఉందంటూ కొనియాడారు సీనియర్‌ దర్శకుడు భారతీరాజా. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై పి.శశికుమార్‌ నిర్మాతగా...పళణికుమార్‌ కథ, దర్శకత్వం వహించిన చిత్రం "ఆధార్‌" . నటుడు కరుణాస్‌ ప్రధాన పాత్ర పోషించారు. శ్రీకాంత్‌ దేవా సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం తాజాగా చెన్నైలో ఘనంగా జరిగింది. అయితే ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన.. డైరెక్టర్ భారతీరాజా మాట్లాడుతూ.. చిత్ర ట్రైలర్‌ అద్భుతంగా ఉందని ఇందులో కరుణాస్‌ పసిబిడ్డతో రోడ్డుపై నడుస్తున్న దృశ్యం తన మనసును చలింపచేదింది అని కళ్ళలో నీళ్ళు తిరిగాయి అని ఆయన అన్నారు.

సినీ పరిశ్రమ ఒక అద్భుతం సినిమా వలన మనకు వచ్చే గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు వేరే ఎక్కడా దొరకవని ఆయన అన్నారు. నటుడు, నిర్మాత అయినటువంటి అరుణ్‌ పాండ్యన్‌ మాట్లాడుతూ చిత్రాన్ని రూ.410 కోట్లతో నిర్మిస్తే అందులో రూ.10 కోట్లు మాత్రమే కథ కోసం ఖర్చుపెట్టి మిగిలింది నటులు తమ కోసమే ఖర్చు పెట్టేస్తున్నారు అంటూ, ఈ విధంగా  తమిళ సినిమా నశించిపోతోంది అంటూ బాధ పడ్డారు. వాస్తవం గురించి మాట్లాడితే, ప్రస్తుతం తమిళ సినిమాల కంటే తెలుగు సినిమాలు బ్రహ్మాండంగా తెరకెక్కుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయని అలాగే గొప్పగా ఉంటున్నాయని ఆయన అన్నారు. తమిళం, మలయాళం చిత్రాల కంటే తెలుగు సినిమానే టాప్ పొజిషన్ లో ఉందని భారతీరాజా తెలుగు సినీ పరిశ్రమను ఆకాశానికి ఎత్తేశారు.

అయితే ఇక్కడ ఆయన తమిళ, మలయాళ ఇండస్ట్రీలను తప్పు పట్టడం లేదని తన ఆవేదన మాత్రమే వ్యక్తం చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమ ఈ మధ్య కాలంలో చాలా అభివృద్ధి చెందింది. సినిమాలలో క్వాలిటీ చాలా చాలా పెరిగింది, ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ను దృష్టిలో వుంచుకుని చిత్రాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు అందుకే ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ పై ప్రశంసలు కురుస్తున్నాయి అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.



మరింత సమాచారం తెలుసుకోండి: